
సూపర్ సిక్స్ అమలు – రైతులకు, మత్స్యకారులకు సాయం
పోలిట్ బ్యూరో సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక ప్రకటనలు చేశారు. "సూపర్ సిక్స్" అమలు మొదలైంది. ఈ ఏడాది నుంచే, రేపు స్కూల్స్ తెరిచే సమయానికి తల్లులకు వందనం ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే, రైతులకు "అన్నదాత-సుఖీభవ" పథకం కింద రూ.20 వేలు ఇవ్వటానికి సిద్ధమయ్యామని వెల్లడించారు. వేట నిషేధ సమయంలో, ఏప్రిల్ 15 లోపే మత్స్యకారులకు రూ.20 వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.