
టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం – కీలక చర్చలు, నిర్ణయాలు
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు, ఇతర కీలక నాయకులు పాల్గొన్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.