
ఎమ్మెల్యే వాసవీ మాతకు పట్టు వస్త్రాలు సమర్పణ
కొత్తపేటలోని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆత్మార్పణ రోజు సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజా కార్యక్రమం ప్రారంభంలో, పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టు వస్త్రాలను సమర్పించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.