
విశేషంగా వాసవి విశ్వరూప సందర్శన మహోత్సవం
విజయవాడ చిట్టినగర్‌లోని వాసవి కన్యకాపరమేశ్వరి మందిరంలో నేడు విశ్వరూప సందర్శన మహోత్సవం (ఆత్మార్పణ దినోత్సవం) భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు.