
వైభవంగా వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం
తెనాలి బోసు రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు.