newspaper
Jan 31st

ఘనంగా వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం

విజయవాడ వన్ టౌన్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ జై వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. కుంకుమ పూజలు, హోమాలు, విశేషార్చనలు జరిగాయి.