
డ్రోన్ల నిఘాతో నేర నియంత్రణ
ఎన్. టి. ఆర్ జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగించి నేర నియంత్రణపై దృష్టి సారించారు. కమిషనరేట్ పరిధిలో డ్రోన్ల ద్వారా బహిరంగ ప్రదేశాల్లో నిఘా ఉంచి, మద్యం, గంజాయి సేవించే వారిని, స్కూల్, కాలేజ్ పరిసరాల్లో ఈవ్ టీజింగ్ చేసే వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు, అసాంఘిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాలను గుర్తించి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.