
స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ 3వ సమావేశం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ 3వ సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు టి జి భరత్, కె అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవి కుమార్, పి. నారాయణ, అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు మరియు వ్యాపార వృద్ధిపై చర్చ జరిగింది.