
కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మొదటిసారిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వారిని రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్, బీజేపీ నేతలు, కార్యకర్తలు స్వాగతించారు. స్టీల్ ప్లాంట్‌కు నిధులు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సహా కేంద్ర ఉక్కుశాఖకు బీజేపీ నేతలు ధన్యవాదాలు తెలిపారు.