
కొల్లేరు సమస్యల పరిష్కారానికి కృషి: ఎంపీ
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, కొల్లేరు పరిరక్షణ సమితి నేతలు ప్రజల సమస్యల నివేదికను ఎంపీకి అందజేశారు. కేంద్ర సహకారంతో శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఎంపీ భరోసా ఇచ్చారు.