newspaper
Jan 29th

యర్రావారిపాలెం క్రాస్.. చెరుకువారిపల్లి రహదారి ప్రారంభం

యర్రావారిపాలెం క్రాస్ నుంచి చెరుకువారిపల్లి వరకు నిర్మితమైన 21 కి. మీ R&B రోడ్డును ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. NABARD నిధులతో రూ. 5 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ రహదారి పనులు పూర్తయినట్లు ఆయన తెలిపారు. ఈ రహదారి ద్వారా రాయచోటికి 17 కి. మీ దూరం తగ్గడంతో పాటు 40 గ్రామాల ప్రజలకు రాకపోకలకు సౌలభ్యం కలుగుతుందని చెప్పారు. అభివృద్ధికి పార్టీలకతీతంగా కలిసి పని చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.