newspaper
Jan 29th

శిరస్త్రాణం – మీ కుటుంబ రక్షణకు సోపానం

రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన హెల్మెట్ ధరించి పాల్గొన్నారు. యువత రోడ్డు ప్రమాద నివారణలో కీలక పాత్ర పోషించాలన్నారు. మద్యం సేవించి, గంజాయి మత్తులో వాహనాలు నడిపితే ప్రమాదాలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.