
శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు పర్యావరణహిత కవర్లు
తిరుమలలో లడ్డూ ప్రసాద కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం పర్యావరణహిత కవర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో ఓ ప్రైవేటు సంస్థ అనుమతులు రద్దయిన తరువాత, తితిదే స్వయంగా లడ్డూ కవర్లను అందిస్తోంది. ప్రస్తుతం పర్యావరణహిత లడ్డూ కవర్ రూ.5కు, జనపనార బ్యాగ్ రూ.10కు విక్రయిస్తున్నారు.