
రైతులకు గోకులం షెడ్ల పంపిణీ
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పొట్టెపాలెం గ్రామంలో పశు ఆరోగ్య శిబిరం కార్యక్రమంలో టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో 50 గోకులం షెడ్లు రైతులకు అందించామని తెలిపారు. ఇప్పటివరకు 36 శిబిరాలు నిర్వహించి, పశువులకు వైద్యం, టీకాలు అందించామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.