
వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శరవేగం
మంగళగిరి నియోజకవర్గం చినకాకాని వద్ద వంద పడకల ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఈ నిర్మాణం పై సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేష్, ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఆసుపత్రి భవన నమూనాను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. "మంగళగిరి ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చాం. మూడు నెలల్లోనే ఆసుపత్రి మంజూరైంది. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని" అన్నారు.