
జీవో 117 ఉపసంహరణపై సమీక్ష
ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై సమీక్ష నిర్వహించారు. జీవో 117 ఉపసంహరణపై అభిప్రాయ సేకరణకు అధికారులను ఆదేశించారు. విద్యార్థుల డ్రాప్ అవుట్ రేటు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి, కో-కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాల్సిందిగా ఆదేశించారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలని సూచించారు.