
‘లిటిల్ హార్ట్స్’పై ఫిదా అయిన మహేశ్ బాబు
చిన్న సినిమాగా విడుదలైన లిటిల్ హార్ట్స్ భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. “ఆద్యంతం సరదాగా సాగే వినోదభరిత చిత్రం” అని అభినందించారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు సింజిత్‌పై ఫన్నీ కామెంట్ చేస్తూ, “ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొద్దు, త్వరలో బిజీ అవుతావ్” అన్నారు. మహేశ్ అభినందనలతో చిత్రబృందం ఆనందంలో మునిగిపోగా, ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.