
ఉపాధ్యాయుడిని కత్తితో పొడిచిన విద్యార్థి
AP: నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం జరిగింది. ఎంటెక్ విద్యార్థి వినయ్ పరీక్ష రాయటానికి పరీక్షా హాలుకు హాజరయ్యాడు. ఈ క్రమంలో వినయ్‌ను పరీక్ష రాసేందుకు అధ్యాపకుడు గోపాల్ రాజు అనుమతించలేదు. ఆగ్రహించిన వినయ్ అధ్యాపకుడిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి హాస్టల్‌కు పారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం అధ్యాపకుడిని ఆసుపత్రికి తరలించింది. విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.