
2 గంటలకు కేటీఆర్ ప్రెస్ మీట్
TG: తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. కవిత సస్పెన్షన్ తర్వాత తొలిసారి ఆయన మీడియా ముందుకు వస్తున్నారు. దీంతో కవిత ఇష్యూపై ఆయన ప్రకటన చేస్తారని అంతా భావిస్తున్నారు. ఇటు, మొదట ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నోటాకు ఓటు వేయాలని భావించిన BRS.. నోటా ఆప్షన్ లేకపోవడంతో తటస్థంగా ఉండాలని నిర్ణయించింది. BTRSకు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్న విషయం తెలిసిందే.